కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాల కోసం ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడొద్దని తెలిపారు. సొంతంగానే సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలని కోరారు. గురువారం మంగళూరులో సూర్యఘర ముఫ్త్ బిజిలీ యోజనపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ శిలాజ ఇంధనాలను వినియోగించి ఉత్పత్తి చేస్తున్న ఉచిత విద్యుత్ పంపిణీ వెనకున్న ఉద్దేశాలపై తాను మాట్లాడనని తెలిపారు. విద్యుత్ రంగంలో సుస్థిరతే దేశానికి సురక్షిత భవిష్యత్తుకు కీలకం అవుతుందని పేర్కొన్నారు. Also Read: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు '' పునురుత్పాదక రహిత ఇంధన వనరులతో ఫ్రీ స్కీమ్స్ భారంగా మారుతున్నాయి. ఉచితంగా పంపిణీ చేస్తున్న వాటికోసం ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. 2.5 లక్షల టన్నుల బొగ్గును అధిక వ్యయంతో వెలికితీయడం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిదారులకు రవాణా చేయడం ఇలా అనేక ఖర్చులుంటాయి. అందుకే పునరుత్పాదక ఇంధన వనరుల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. గ పదేళ్లలో భారత్ 95.5 గిగావాట్ల సోలార్ విద్యుత్ టార్గెట్‌ను ఛేదించింది. అంతకుముందు ఇది కేవలం 2.3 గిగావాట్లు మాత్రమే ఉండేదని'' ప్రహ్లాద్ జోషి తెలిపారు. Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు ఇదిలాఉండగా.. ఇంటి రూఫ్‌టాప్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంటు బిల్లులు తగ్గించేందుకు కేంద్రం గతేడాది ఫిబ్రవరిలో "ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన" పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం కోటి మంది ప్రజలు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. Also Read: గోవా హోటల్‌లో ఘోరం.. ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి కొట్టి, ఆఖరికి! Also Read: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం