Andhra tourist killed: గోవా హోటల్‌లో ఘోరం.. ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి కొట్టి, ఆఖరికి!

న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని అక్కడి రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో కొట్టి చంపింది. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేశారు. ఈ దాడిలో రవితేజ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

New Update
Andhra tourist killed in goa

Andhra tourist killed in goa

న్యూ ఇయర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌ లెవెల్లో జరుపుకున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి పార్టీలు, పబ్బులు, రెస్టారెంట్లు, బీచ్‌లలో రచ్చ రచ్చ చేశారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ చిల్ అయ్యేందుకు టూర్‌లు ప్లాన్‌ చేశారు. ఇక ప్లాన్ ప్రకారమే.. డిసెంబర్ 31 నైట్‌కి అందమైన ప్రదేశాలకు చేరుకుని ఎంజాయ్ చేశారు. 

ఇది కూడా చూడండి: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

కానీ కొన్ని చోట్ల ఆ ఎంజాయ్‌మెంట్ విషాదాన్ని నింపింది. 2025కు వెల్‌కమ్ చెప్తూనే కొన్ని జీవితాలు గాల్లో కలిసిపోయాయి. అనుకోని సంఘటనలు కొన్ని యువకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. అలాంటిదే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడిని అక్కడి రెస్టారెంట్ మాఫియా కర్రలతో కొట్టి చంపింది. 

ఏపీ టు గోవా

ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సర వేడుకల కోసం ఏపీలోని తాడేపల్లిగూడెం నుండి కొందరు యువతి, యువకులు గోవాకు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. ఎనిమిది మంది స్నేహితులు గోవాకు వెళ్లారు. అక్కడ డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు. 

ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ

డిసెంబర్ 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్టులకు, గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టుకున్నారు. దాడిలో రవితేజ అనే యువకుడు  తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యలోనే రవితేజ మృతి చెందాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే అక్కడ బీచ్‌లో జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisment
తాజా కథనాలు