Madras High Court: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

అన్నా వర్సిటీ రేప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఒక హెచ్చరికగా భావించకుండా ఎందుకు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తింది. మరింత సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Madras High Court

Madras High Court

చెన్నైలో అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మద్రాస్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఒక హెచ్చరికగా భావించకుండా ఎందుకు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తింది. విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి నిరసనగా ఆందోళన చేపట్టేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని పట్టలి మక్కల్ కట్చి పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.     

Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌లో కేవలం రాజకీయ కోణం ఉంది తప్పు బాధితురాలికి న్యాయం చేయాలన్న తపన కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కేవలం మీడియా దృష్టిని మాత్రమే ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు నిరసనలను తమకోసం వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో నిజాయితీ కనిపించడం లేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ వేల్‌మురుగన్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కొన్ని అంశాల్లో మీడియ సరైన పద్ధతి అనుసరించడం లేదు. కులం, మతం, స్త్రీ, పురుష వివిక్ష తదితర అసమానతలు ఉన్న ఈ కాలంలో జీవించడం నాకు సిగ్గేస్తోంది. నిజంగా మనమందరం సిగ్గుపడాలి. గట్టిగా చెప్పాలంటే ఇలాంటి నేరాల్లో మనమందరం సహ నిందితులమేనని'' జస్టిస్ వేల్‌మురుగన్ అన్నారు. 

Also Read: గోవా హోటల్‌లో ఘోరం.. ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి కొట్టి, ఆఖరికి!

ఇదిలాఉండగా.. డిసెంబర్ 23న రాత్రి అన్నా వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. క్యాంపస్ ప్రాంగణంలో ఆ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమె స్నేహితుడిపై దాడి చేశారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆమె ఫొటోలు తీసి.. తమ గురించి పోలీసులకు చెబితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మద్రాస్ కోర్టు.. ఈ కేసు దర్యాప్తు మహిళా అధికారులతోనే చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అలాగే బాధితురాలికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు