రైతులకు రుణ సదుపాయాన్ని పెంచాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. వ్యవసాయ అవసరాలకు, పంట అవసరాల కోసం ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు దాన్ని మరింత పెంచింది. ఆ రుణాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
2 వేల నుంచి 2లక్షలకు..
రాను రాను ద్రవ్యోల్బణం పెరుగుతోంది. రైతులకు ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2004లో కేవలం రూ.10 వేలే ఉంది. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. ఇప్పుడు అది రెండు లక్షలు అయింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. రైతులు నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. అయితే ఇది చాలా చోట్ల అమలు కావడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని అప్పులపాలవుతున్నారు. ఇక మీదట అలాంటివి జరగకూడదనే రిజర్వ్ బ్యాంక్ ఈ సదుపాయం కల్పిస్తోంది. ఈ చర్య ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని కేంద్రం చెబుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలుచేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది.
Also Read: HYD: సీఎం రేవంత్ ను పెళ్ళికి ఆహ్వానించిన పీవీ సింధు