![rains](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.
ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు రైతులకు సూచనలు చేశారు. పంట చేతికి వచ్చే సమయం. కాబట్టి పంట కోస్తే వాటిని జాగ్రత్త పరచుకోవాలని తెలిపారు. పంట కోతకు వస్తే ఒక రెండు రోజులు ఆగి కోయాలని సూచించారు.
ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!
ఇదిలా ఉండగా వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పన్నెండు గంటల వరకూ సూర్యుడు బయటకు కనిపించడం లేదు. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!