భార్య వేధింపులు భరించలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతుల్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించనున్నారు.
#BreakingNews
— Dr R.Tripathi(BJP) (@Vairagi2288) December 15, 2024
Atul Subhash's wife Nikita Singhania has been arrested from Gurugram and sent to judicial custody.
She's a lookalike of Hidimba and her brother seems to be a Pappu.
How ruthless she looks?!#AtulSubhashsuicidecase #INDvsAUS pic.twitter.com/DUncaX6mzD
ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
లేఖ రాసి ఆత్మహత్య..
బెంగళూరుకి చెందిన అతుల్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని 24 పేజీల లేఖను రాసి అతుల్ చనిపోయాడు. తప్పుడు కేసులతో భార్యలు వేధిస్తే.. భర్తలకు చనిపోవడం తప్ప మరొక దారి లేదని వాపోయాడు. భర్త ఉద్యోగం చేయకపోయిన జాబ్ చేస్తున్న భార్యకు భరణం ఇవ్వాలని తన బాధను వ్యక్తపరిచాడు.
ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల
మొదట కోటి రూపాయిలు ఇవ్వాలని అతుల్ భార్య డిమాండ్ చేసిందని ఆ తర్వాత రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని లేఖలో వెల్లడించాడు. చివరకు తన కొడుకును చూడటానికి కూడా రూ.30 లక్షలు డిమాండ్ చేసిందని అతుల్ ఆందోళన చెందాడు. కొందరు మహిళలు ఇలానే మగాళ్లను వేధించి వారి కన్నీటి చుక్కలతో డబ్బు పోగేసుకుంటున్నారని అతుల్ బాధపడ్డాడు.
ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!
తన భార్య వేధింపులు భరించలేక నెల రోజులు ముందు నుంచే ఆత్మహత్య చేసుకోవడానికి ప్లాన్ చేశాడు. తన క్రెడిట్ కార్డు బిల్లులు, ఆఫీస్ వర్క్ అన్ని కూడా పూర్తి చేసి ప్లాన్ ప్రకారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆమె తప్పించుకుని తిరుగింది. చివరకు పోలీసుల చేతికి చిక్కింది.
ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!