కేవలం ఆరు రోజుల్లో పుష్ప–2 వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ ఫీట్‌ను సాధించలేదు. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. దీని గురించి మూవీ హీరో అల్లు అర్జున్ స్పందించారు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. భారతీయులందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యే క ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ అన్నారు బన్నీ.
మొత్తం సుకుమార్ దే..
ఒక సినిమాను అన్న రాష్ట్రాల ప్రజలూ సెలబ్రేట్ చేయడం ఇద మొదటిసారి అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇదే నా దేశగొప్పతనం అన్నారు. ఇక ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం మొత్తం దర్శకుడు సుకుమార్ కే చెందుతుందని చెప్పారు అల్లు అర్జున్. ఆయన విజన్, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా. ఇక ఈ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేయడం ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. అయితే ఈ నెంబర్స్ టెంపరరీ. ఎందుకంటే భవిష్యత్‌లో మరో సూపర్‌హిట్ సినిమా ఈ నెంబర్స్‌ను క్రాస్ చేస్తుంది. కానీ ఆడియన్స్ ఇచ్చే లవ్ మాత్రం శాశ్వతం. వాళ్లు నా పై చూపిస్తున్న వైల్డ్ ప్రేమకు జీవితాంతం బుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు.
Also Read: TS: నలుగురు కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు