తెలంగాణకు 7 నవోదయ, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు ఆమోదం..

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించనుంది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 28 కొత్త నవోదయ విద్యాలయాలు రానున్నాయి.

New Update
SCHOOL

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ తాము తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 28 కొత్త నవోదయ విద్యాలయాలు రానున్నాయి.  

Also Read: మహిళా హోంగార్డ్ కిర్రాక్ మోసం.. రిటైర్డ్ ఏఈ మార్ఫింగ్ ఫొటోలతో!

త్వరలో రానున్న ఈ కేంద్రీయ విద్యాలయాల ద్వారా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. 2025-26 నుంచి 8 ఏళ్ల కాలంలో కొత్త కేవీల నిర్మాణానికి, అలాగే ఒక కేవీని విస్తరించేందుకు అంచనా వ్యయం రూ.5,872.08 కోట్లుగా నిర్ణయించారు. ఏపీలో.. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు,  నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. 

Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

తెలంగాణలో నిజామాబాద్‌, కొత్తగూడెం, జగిత్యాల, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయా విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది. ఇదిలాఉండగా.. హర్యానాలో మెట్రో కనెక్టివిటీని అభివృద్ధి చేసేందుకు అలాగే ఢిల్లీలో మెట్రో కోసం 26.46 కిలోమీటర్ల రిథాలా-కుండ్లీ కారిడర్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 

Also Read: వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్‌!

Also Read: ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు