/rtv/media/media_files/2024/12/06/2HwLW5I6yHBjfsHyUY88.jpg)
ఇదొక భారీ మోసం. డబ్బులు అప్పుగా ఇచ్చిన వ్యక్తినే ఓ మహిళ హోంగార్డ్ బెదిరించింది. మార్ఫింగ్ ఫొటోలతో అతడిని కంగారు పెట్టించింది. డబ్బులు ఇస్తావా? ఫొటోలు బయటపెట్టనా? అంటూ అతడిని గజగజలాడించింది. దీంతో తన పరువు ఎక్కడ పోతుందోనని వణికిపోయిన అతడు ఆమె అడిగినంత డబ్బు ఇచ్చాడు. కానీ ఆమె ఆశ చావలేదు. మరికొంత డబ్బు కావాలని బెదిరించింది. దీంతో విసిగిపోయిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం
లేడీ మోసం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో ద్వారకా శేఖర్ ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అదే సమయంలో స్థానికంగా ఉండే వడ్ల అనూష వేములవాడ రాజన్న ఆలయంలో హోంగార్డుగా పనిచేస్తుంది. ఓ రోజు తన భర్త ఆరోగ్యం బాలేదని శేఖర్ వద్ద నుంచి గతంలో దాదాపు రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకుంది. దీంతో ఆమె ఎప్పటికీ తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో శేఖర్ అడిగారు.
ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
దీంతో ఆమె అసలు రంగు బయటపడింది. డబ్బులు ఎగ్గొట్టేందుకు కొత్త నాటకానికి శ్రీకారం చుట్టింది. శేఖర్ పై తప్పుడు ప్రచారం చేయడం మొదలెట్టింది. శేఖర్ తనను పెళ్లి చేసుకున్నాడని రచ్చ రచ్చ చేసింది. అంతటితో ఆగకుండా పెళ్లి పత్రిక, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అసత్య ప్రచారం చేయడం ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ
తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా.. మరోసారి రూ.5లక్షల డిమాండ్ చేసింది. మొదట్లో భయపడ్డ శేఖర్.. ఆ తర్వాత మెల్ల మెల్లగా ధైర్యం తెచ్చుకున్నాడు. దీంతో బాధితుడు శేఖర్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన వివరాలను పోలీసులకు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత.. ఫొటోలు వైరల్
అయితే ఇక్కడ కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనూష సంపన్నులనే టార్గెగ్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. వారిని గుర్తించి డబ్బు కోసం వలలో దించి ఆపై బెదిరిస్తుందని సమాచారం. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఏఈని వలలో పడేసినట్లు తెలిసింది. ఇక ఆమె వలలో పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.