BIG BREAKING: పుల్వామా దాడి నిందితులను లేపేశాం - ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన

ఆపరేషన్ సిందూర్‌లో పుల్వామా దాడి నిందితులను సైతం హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. వారిలో యూసుఫ్ అజార్ IC-814 విమాన హైజాక్‌కు ప్రధాన సూత్రధారి ఉన్నాడు. అలాగే అబ్దుల్ మాలిక్ రవూఫ్ కూడా IC-814 హైజాకింగ్‌తో పాటు పుల్వామా దాడి కుట్రలో ఉన్నాడని తెలిపారు.

New Update

ఆపరేషన్ సిందూర్‌ గురించి భారత త్రివిధ దళాల అధిపతులు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయాల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ కింద ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్,  పీఓకేలోని ఉగ్రవాదులను నిర్మూలించడం మాత్రమేనని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

పుల్వామా నిందుతులు ఖతం

9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని.. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. వారిలో IC-814 విమానం హైజాక్ కుట్రదారులు, పుల్వామా దాడి నిందితులు ఉన్నారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మనం పూర్తి ఆకస్మిక దాడి చేశామనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. 9 ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

వైమానిక దాడిలో యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్‌లను కూడా ఇండియన్ ఆర్మీ హతమార్చిందని చెప్పుకొచ్చారు. యూసుఫ్ అజార్ IC-814 విమాన హైజాక్‌కు ప్రధాన సూత్రధారి అని తెలిపారు. అంతేకాకుండా అతడు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నాడని కూడా చెప్పారు. 

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

అలాగే అబ్దుల్ మాలిక్ రవూఫ్ కూడా IC-814 హైజాకింగ్‌తో పాటు పుల్వామా దాడి కుట్రలో ఉన్నాడని వెల్లడించారు. ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిని శిక్షించడం, వారి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం అనే స్పష్టమైన సైనిక లక్ష్యంతో ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించబడిందని తెలిపారు. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

operation Sindoor | ind pak war | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు