/rtv/media/media_files/2025/05/11/iut19bg9gfwzzWuAudMJ.jpg)
BLA-pak
పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయాలని BLA ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్ తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది. చర్చల అనంతరం పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే అందుకు తాము మద్దతిస్తామని వెల్లడించింది. భారత్ కు సైనిక శక్తిగా నిలుస్తామని.. పశ్చిమ సరిహద్దు నుంచి పాక్ పై దాడి చేస్తామని స్పష్టం చేసింది. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తుంది.
A new order has become inevitable in the region – BLA
— Ben Leder (@BenLederX) May 11, 2025
Baloch Liberation Army presents its clear position in the backdrop of ongoing and escalating conflicts and regional tensions. We strongly reject the idea that Baloch national resistance is a proxy of any state or power. The… pic.twitter.com/5KSxDSRMnY
ఏ దేశానికీ కీలుబొమ్మ కాదు
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికీ కీలుబొమ్మ కాదని, ప్రాంతీయ సైనిక, రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీ అని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శాంతి, కాల్పుల విరమణ ప్రకటనలను బీఎల్ఏ మోసంగా అభివర్ణించింది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య అని తెలిపింది. పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారత్ కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణించిన BLA, పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందని పేర్కొంది. పాకిస్తాన్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని బిఎల్‌ఎ హెచ్చరించింది. పాకిస్తాన్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకుంటే, పశ్చిమ సరిహద్దు నుండి సైనిక మద్దతు అందించడానికి BLA సిద్ధంగా ఉందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.