ఇండియా కూటమికి షాక్.. సీఎం ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా ఫడ్నవీస్‌ను ఉద్ధవ్‌ కలిశారు. అయితే శివసేన (ఉద్ధవ్ వర్గం) ఇండియా కూటమిని వీడపోతున్నారనే ప్రచారం నడుస్తోంది.

New Update
UDDAv

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా ఫడ్నవీస్‌ను ఉద్ధవ్‌ కలిశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఉద్ధవ్ ప్రకటించారు. అయితే శివసేన (ఉద్ధవ్ వర్గం) ఇండియా కూటమిని వీడపోతున్నారనే ప్రచారం నడుస్తోంది. 

కాంగ్రెస్‌ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీర్‌ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఉద్ధవ్ శివసేన సీరియస్ అయ్యింది. మరి ఉద్ధవ్‌ వర్గం రాబోయే రోజుల్లో ఇండియా కూటమితో ఉంటుందా లేదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే కూడా తనకు సీఎం పదవి రాకపోవడంపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. మరి భవిష్యత్తులో ఆయన వర్గం కూడా ఎన్డీయే కూటమితో కలిసే ఉంటుందా లేదా విడిపోతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.  

Also Read: కంపెనీలో సిబ్బందికి పనిష్మెంట్‌.. 30 నిమిషాలు నిల్చోవాలంటూ సీఈవో ఆదేశం

ఇదిలాఉండగా ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎంగా ఫడ్నవీస్.. ఏక్‌నాథ్ షిండే, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఆదివారం పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది.  మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ వాళ్లతో ప్రమాణం చేయించారు.

Also Read: అల్లు అర్జున్ కు పోలీసుల షాక్.. బెయిల్ రద్దు?

బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావాన్‌కులే, చంద్రకాంత్‌ పాటిల్‌, గిరీశ్‌ మహాజన్‌, అతుల్‌ సావే, అశోక్‌ ఉయికే, ఆశిశ్‌ శేలార్‌, శివేంద్రసిన్హ భోసలే తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి  గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, శంభూరాజ్‌ దేశాయ్‌, ఉదయ్‌ సామంత్‌, సంజయ్‌ రాథోడ్‌ ప్రమాణ చేశారు. ఇక ఎన్సీపీ నుంచి  దత్తత్రేయ భార్నే, అధితీ తాత్కరే, ధనంజయ్‌ ముండే, హసన్‌ ముష్రిఫ్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

Also Read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

Also Read: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు