పుష్ప-2' మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..! దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైలుకి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయమే బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చేసాడు. అయితే తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ కు మరో షాక్ తగలనుంది . అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టయి నైట్ మొత్తం జైలులో ఉన్న అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..! Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..!