సాధారణంగా స్కూళ్లలో హోంవర్క్ చేయని విద్యా్ర్థులను, తరగతి గదిలో అల్లరి చేసే వాళ్లని టీచర్లు పనిష్మెంట్లు విధిస్తుంటారు. గోడ కుర్చీ వేయించడం, క్లాస్ బయటికి వెళ్లిపోమ్మనడం, నిల్చోమని చెప్పడం లాంటి పనిష్మెంట్లు ఇస్తుంటారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చేసుకుంది. ఓ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగులకే పనిష్మెంట్ ఇచ్చారు. ఓ పని విషయంలో అక్కడికి వచ్చిన వృద్ధుడికి అసౌకర్యం కలిగించినందుకు 30 నిమిషాల పాటు నిల్చోని పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా ఇక వివరాల్లోకి వెల్తే యూపీలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన సంస్థలో 16 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ల దగ్గరికి నోయిడా ప్రజలు వివిధ పనుల కోసం వస్తుంటారు. అయితే ఈ సంస్థకు గత ఏడాది ఐఏఎస్ అధికారి డా.లోకేశ్ సీఈవోగా నియామితులయ్యారు. ఈయన ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా సీరియస్ అవుతారు. అయితే సోమవారం ఓ వృద్ధుడు కౌంటర్ వద్ద నిలిబడి ఉండటాన్ని సీఈవో సీసీ కెమెరాలో చూశారు. ఆయన పనెంటో చూడాలని.. ఆ పని వీలుకాకపోతే చెప్పేయాలని ఉద్యోగికి చెప్పారు. కానీ 20 నిమిషాల తర్వాత కూడా ఆ వృద్ధుడు అలాగే కౌంటర్ వద్దే నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన సీఈవో వెంటనే కార్యాలయం వద్దకు వచ్చి ఉద్యోగులపై మండిపడ్డారు. అందరూ 20 నిమిషాల పాటు నిల్చోని పనిచేయాలంటూ పనిష్మెంట్ ఇచ్చారు. సిబ్బంది నిల్చోని పనిచేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn — Sneha Mordani (@snehamordani) December 17, 2024