GOOD NEWS: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే!

నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 13,735 క్లర్క్ (జూనియర్‌ అసోసియేట్‌) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ & సేల్స్‌ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

New Update
SBI jobs

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వేలల్లో ఖాళీల భర్తీకి ప్రకటన వదిలి నిరుద్యోగులకు ట్రీట్ అందించింది. దాదాపు 13,735 క్లర్క్ (జూనియర్‌ అసోసియేట్‌) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్‌) విభాగంలో భారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ మొత్తం ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. అందులో ఏపీలో 50, తెలంగాణలో 342 ఖాళీలు ఉన్నాయి. 

విద్యార్హత:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.  

వయస్సు:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, పిడబ్ల్యూబిడీ అభ్యర్థులకు 10ఏళ్ల వరకు వయోపరిమితితో సడలింపు ఉంటుంది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

ఎంపిక:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎక్జామ్ అండ్ మెయిన్ ఎక్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. 

పరీక్ష కేంద్రాలు: 

ఏపీ: గుంటూరు, అనంతపురం, విజయవాడ, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

తెలంగాణ: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

దరఖాస్తు తేదీ: డిసెంబర్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 7 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు