Trump Tariffs Effect: ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. ఆ క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!

ట్రంప్ భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ  సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో కోకా-కోలా, పెప్సీకో వంటి అమెరికాకు చెందిన సాఫ్ట్ డ్రింక్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

New Update
Trump tariffs effect

Trump tariffs effect

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(Lovely Professional University)  సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో కోకా-కోలా(coca-cola), పెప్సీకో(PepsiCo) వంటి అమెరికాకు చెందిన సాఫ్ట్ డ్రింక్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిని 'స్వదేశీ 2.O' ఉద్యమంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికా మొదట భారత్‌పై 25 శాతం సుంకాలు విధించగా వీటిని పెంచుతూ 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే లవ్వీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: Russia-Ukraine War: మొదటి సీ డ్రోన్ ప్రయోగించిన రష్యా..పేలిపోయిన ఉక్రెయిన్ అతిపెద్ద నౌక

పంజాబ్ ఎంపీ మిట్టల్ ఓ క్లబ్‌లో మాట్లాడుతూ..

పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మాట్లాడుతూ 1905 నాటి స్వదేశీ ఉద్యమంతో దీన్ని పోల్చారు. గతంలో బ్రిటిష్ వారికి సంబంధించిన వస్తువులను తిరస్కరించినప్పుడు మనమేందుకు నేడు వాటిని తిరస్కరించలేకపోతున్నామన్నారు. భారత్ బలం, సంకల్పాన్ని అమెరికా తక్కువ అంచనా వేసిందని, దీనికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని డాక్టర్ మిట్టల్ అన్నారు. అమెరికాకు మిత్ర దేశమైన రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.  

సుంకాలు పెంచుకుంటూ పోతే భారత్ సెలైంట్‌గా కూర్చోదని..

అదే భారత్ ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంటే అన్యాయం అని అమెరికా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శించారు. ఈ క్రమంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీటిని బహిష్కరించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ బహిష్కరణ ప్రారంభం అయ్యిందన్నారు. ట్రంప్ సుంకాలు పెంచుకుంటూ పోతే భారత్ సైలెంట్‌గా కూర్చోదని అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ మార్కెట్ నుంచి అమెరికా కంపెనీలు ఏటా రూ.6.5 లక్షల కోట్ల లాభాలు పొందుతున్నారు. మళ్లీ భారత్‌పై ఆంక్షలు విధించడంతో దేశంలో అమెరికా కంపెనీల వస్తువులు బహిష్కరణ చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

Advertisment
తాజా కథనాలు