North Korea Missiles: జపాన్ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించి.. అది విఫలం కావడంతో తాజాగా 10 బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రంలో (జపాన్ సముద్రం) పరీక్షించింది. దీంతో అమెరికా. దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తం అయ్యాయి.