BJP MLA : హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లకండి.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లకూడదు అని చేసిన సలహా తీవ్ర వివాదానికి దారి తీసింది. బీడ్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

New Update
gym

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లకూడదు అని చేసిన సలహా తీవ్ర వివాదానికి దారి తీసింది. బీడ్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ సలహా ఇవ్వడానికి గల కారణాన్ని వివరిస్తూ, ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఎవరిని నమ్మాలో అమ్మాయిలకు తెలియదని పేర్కొన్నారు.  

పెద్ద కుట్ర జరుగుతోంది

"పెద్ద కుట్ర జరుగుతోంది, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. బాగా మంచిగా మాట్లాడే లేదా చాలా మంచివాడిగా నటించే వారి చేతిలో మోసపోకండి" అని పడల్కర్ అన్నారు. ఇలాంటి వ్యక్తులు మహిళలను ఆకర్షించి, వారిని వలలో వేసుకుంటున్నారని అన్నారు.  గుర్తింపు వివరాలులేకుండా కళాశాలలకు వచ్చే యువకులను గుర్తించి, వారిని లోపలికి అనుమతించకుండా ఆంక్షలు విధించాలని కూడా ఆయన కోరారు.

Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్

గోపీచంద్ పడల్కర్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా, జత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదివరకే, సెప్టెంబర్‌లో ఎన్‌సీపీ-ఎస్‌పీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ చంద్ర పవార్) నాయకుడు జయంత్ పాటిల్, వారి తల్లిదండ్రులపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని సృష్టించాయి.

Advertisment
తాజా కథనాలు