Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ కిరీటం సాధించిన భారతీయ యువతి మిస్ టీన్ యూనివర్స్ కిరీటం ఈసారి భారత్‌కు దక్కింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల తృష్ణా రే విజయం సాధించారు. రెండు, మూడు స్థానాల్లో పెరూ, నమీబియా నిలిచాయి. By B Aravind 12 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మిస్ టీన్ యూనివర్స్ కిరీటం ఈసారి భారత్‌కు దక్కింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలు జరిగాయి. పెరూ, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్, నమీబియా, కెన్యా తదితర దేశాలకు చెందిన మోడళ్లు ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే భారత్‌కు చెందిన 19 ఏళ్ల తృష్ణా రే.. వీళ్లందరినీ వెనక్కి నెట్టి మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. పెరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ప్రెషియస్ ఆండ్రీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. Also Read : TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు! Trishna Ray తృష్ణా రే ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి. కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీల రే ఈమె తల్లిదండ్రులు. ప్రస్తుతం తృష్ణా రే.. భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ ఇండియా పోటీలో కూడా తృష్ణా రే విజయం సాధించారు. ఇప్పుడు అంతర్జాతీయంగా జరిగిన మిస్ టీన్ యూనివర్సిటీ పోటీల్లో కూడా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. Also Read : నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్ ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకురాలు డా.అచ్యుత సమంత.. తృష్ణా రేకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన విడియోను నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తృష్ణా రే విజయానికి సంబంధించిన విషయాలను కేఐఐటీ ఇన్‌స్టిట్యూట్ కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈమె గెలుపు దేశానికే గర్వకారణమని పేర్కొంది. Also Read : 'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో Also Read : RTVతో అఘోరి.. నా విశ్వ రూపం చూపిస్తా.. వాడి మర్మాంగాలు కొస్తా! #trishna-ray #telugu-news #national-news #miss-universe-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి