/rtv/media/media_files/2025/07/04/three-kerala-districts-on-alert-after-nipah-cases-2025-07-04-14-16-07.jpg)
Three Kerala districts on alert after Nipah cases
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపింది. తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి మలప్పురం జిల్లాలో రాగా.. మరొకటి పాలక్కాడ్ జిల్లాలో నమోదైంది. దీంతో కోజికోడ్, మలప్పురం పాలక్కాడ్ ఈ మూడు జిల్లాల్లో కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మలప్పురం, కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఇక తుది నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు.
Also Read: మరో విమానంలో టెక్నికల్ ఇష్యూ.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అధికారిక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ నివారణ చర్యలు వెంటనే కఠినతరం చేయాలని కేరళ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్‌మెంట్ ప్లానింగ్, పబ్లిక్ కమ్యూనికేషన్‌తో సహా నిఫా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి జిల్లాలో మొత్తం 26 కమిటీలను ఏర్పాటు చేశారు. వైరస్ జాబితాన సిద్ధం చేయడంతో పాటు ఆంక్షలను అమలు చేసేందుకు ప్రత్యేక పోలీసుల బృందాలను నియమించారు.
Also Read: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకే.. రేసులో ముగ్గురు
కంటైన్మెంట్ జోన్‌లు ప్రకటించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
Also Read: ఎయిరిండియా ప్రమాదం.. ఆర్థిక వివరాలిస్తేనే పరిహారం !