BREAKING: మరో విమానంలో టెక్నికల్ ఇష్యూ.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

స్పైస్‌ జెట్‌కి చెందిన ఓ విమానంలో టేకాఫ్ అయిన కొంత సమయానికే సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో వెంటనే చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దాదాపుగా రెండు గంటల పాటు చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

New Update

ప్రస్తుతం ఎక్కువగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అధికంగా విమానాల్లో సమస్యలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులు ఇలా ఏదో ఒకటి వస్తోంది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

టేకాఫ్ అయిన వెంటనే..

స్పైస్‌ జెట్‌కి చెందిన ఓ విమానం చెన్నై నుంచి హైదరాబాద్‌కి బయలు దేరింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొంత సమయానికే సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో వెంటనే చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దాదాపుగా రెండు గంటల పాటు చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులు ఇంకా ఎంత సమయం వెయిట్ చేయాలని అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో చిరాకు అవుతున్నారు. 

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

ఇదిలా ఉండగా ఇటీవల స్పైస్‌ జెట్‌లో కిటికీ ఫ్రేమ్ తెరుచుకున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. గోవా నుంచి పుణె వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు