యుద్ధం భయంలో ఏం చేయాలో తెలియడం లేదు పాకిస్తాన్, ఇంకా ఉగ్రవాదులకు. దీంతో భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు. బెదిరింపులు చేస్తే లొంగుతారనే ఉద్దేశంతో లేఖలను పంపిస్తున్నారు. బెంగాల్‌లో భారత ఆర్మీ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఇంటికి బెదిరింపు లేఖ పంపించారు. చేత్తో రాసిన లెటర్‌ను ఆయన ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు అంటించి వెళ్ళారు. కాశ్మీర్ లో స్పెషల్ ఫోర్స్ పారా కమాండోగా గౌరవ్ ముఖర్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పాకిస్తాన్ జిందాబాద్..గౌరవ్ తల కావాలి..
గౌరవ్ తల కావాలి.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ముష్కరులు బెదిరింపు లేఖలో రాశారు. హిందువులను రక్షించే ప్రయత్నం చేస్తే చంపేస్తామంటూ కుటుంబాన్ని సైతం బెదిరించడానికి ప్రయత్నం చేశారు. బెంగాల్‌ని బంగ్లాదేశ్‌గా మారుస్తామంటూ లేఖలో రాశారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు కూడా అందులో కనిపించాయి. హుగ్లీ జిల్లాలోని ధనియాఖలి గ్రామంలోని ఆర్మీ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఇంటి బయట శనివారం రాత్రి దొరికిన ఆ నోట్‌లో బెంగాలీలో అనేక స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి. అతని కుటుంబంపై బెదిరింపులు కూడా ఉన్నాయి. దీనిపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లేఖను అతికించిన సమయంలో...గౌరవ్ ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అందులో రెండు స్కూటర్లపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కనిపించారు. వీరు నిజంగా పాకిస్తాన్ లేదా ఉగ్రవాదులకు సంబంధించ వారా...లేక గౌరవ్ కుటుంబంతో విభేదాలు ఉన్నావారు ఎవరైనా ఈ ని చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/01/5tfyqDtwVy39QAFkXSEs.jpeg)
హుగ్లీ గ్రామీణ పోలీస్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గౌరవ్ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. లేఖ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు తెలిపారు. గౌరవ్ ఇంటి చుట్టూ నిఘా కెమెరాలు, బయట పోలీస్ పికెట్ తో 24 గంటలూ కాపలా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ లేఖతో ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉన్నట్టు కనిపించడ లేదని...స్థానిక దుండుగుల చేసిన పనిలా ఉందని అధికారులు చెబుతున్నారు.
today-latest-news-in-telugu | terrorists | army-jawan | indian
Also Read: Pakistan: ఐఎస్ఐ ఛీఫ్ కు కీలక బాధ్యతలు..పాకిస్తాన్ మరో ఎత్తుగడ