భారత్ తో యుద్ధం పాకిస్తాన్ బాగా భయపెడుతోంది. ఇప్పుడు యుద్ధం జరిగితే పాకిస్తాన్ కు అది చాలా గట్టి దెబ్బే అవుతుంది. జయ, అపజయాల మాట పక్కన పెడితే పాకిస్తాన్ కు యుద్ధం చేసే స్థోమతే లేదు అసలు. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా బాగా చితికిపోయి ఉంది. అలాంటి ఇప్పుడు యుద్ధం అంటే బోలెడంత ఖర్చు అవుతుంది. భారత్ కు ఇదేమీ పెద్ద లెక్క కాదు. కానీ పాకిస్తాన్ కు ఇది చాలా పెద్ద విషయం. దానికి తోడు భారత్ సింధు జలాలు, వాణిజ్య లాంటి పెద్ద నిర్ణయాలతో పాక్ ను కట్టడి చేసింది. దీనికే ఆ దేశం గిలగిల కొట్టుకుంటోంది. అలాంటిది ఇప్పుడు యుద్ధం జరిగితే పాకిస్తాన్ కు ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే దాయాది యుద్ధం జరగకుండా ఉండేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
పాక్ మరో కొత్త ఎత్తుగడ..
ఇదిలా ఉంటే మరోవైపు భారత్ ను ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ కు చాలా శక్తి అవసరం. పాక్ ఆర్మీ, ఆయుధాలు ఎలా పోల్చుకున్నా కూడా భారత్ బలం ఎక్కువగా ఉంది. మన దేశాన్ని ఎదుర్కోవాలంటే దాయాది దేశం చాలా కష్టపడాలి. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది పాకిస్తాన్ ప్రభుత్వం. తాజాగా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మాలిక్ ను గతేడాది సెప్టెంబర్ లోనే ఐఎస్ఐ ఛీఫ్ గా నియమించారు.
మరోవైపు ఇరు దేశాల ఉద్రిక్తత నడుమ సరిహద్దుల్లో కాల్పులు మోత మోగుతూనే ఉంది. వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఉరి, కుప్వారా, అఖ్నూర్ సెక్టార్‌లో భారత్ ఆర్మీపై కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.
today-latest-news-in-telugu | isi
Also Read: Ind-Pak: కాల్పులు కొనసాగిస్తున్న పాకిస్తాన్..ఎల్వోసీ దగ్గర ఉద్రిక్తత