Whiskey Sales : మద్యం వినియోగంలో దక్షిణాదినే హవా...టాప్‌లో ఆ రాష్ట్రం

భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (FY25)లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58శాతం రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చిందని తేలింది.  

New Update
wine shop

Indian-Made Foreign Liquor Whiskey Sales

Whiskey Sales : మనదేశంలో మద్య వినియోగం ఎక్కువే. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ( Indian-Made Foreign Liquor( IMFL) వినియోగంలోనూ దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (FY25)లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58శాతం రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చిందని తేలింది.  అయితే దేశవ్యాప్తంగా విస్కీ వినియోగంలో టాప్‌ ఎవరో తెలుసా? మనమైతే కాదండోయ్‌.. విస్కీ వినియోగంలో  కర్ణాటక తొలి స్థానంలో నిలిచినట్లు (అమ్మకాల్లో 17శాతం) కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (CIABC) వెల్లడించింది.

Also Read: Bigg Boss 9 Telugu Thanuja Photos: మోడ్రన్ డ్రెస్‌లో తనూజ క్యూట్ ఫొటోలు.. కుర్రాళ్లను ఫిదా చేస్తున్న బ్యూటీ!

దక్షిణాదిన ఉన్న పుదుచ్చేరితోపాటు  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం (Indian-Made Foreign Liquor) అమ్మకాల్లో తమ జోరును కొనసాగించాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40.17 కోట్ల విస్కీ కేసుల అమ్మకాలు జరగగా..కేవలం  దక్షిణాది రాష్ట్రాల్లోనే 58శాతం వినియోగం జరిగినట్లు తేలింది. ఈ రాష్ట్రాల్లో 23.18 కోట్ల కేసులు అమ్ముడైనట్లు సీఐఏబీసీ వెల్లడించడం గమనార్హం.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

ఈ అమ్మకాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 6.88 కోట్ల కేసులు అంటే మొత్తం అమ్మకాల్లో (17శాతం) అమ్ముడయ్యాయి. ఇక రెండవ స్థానంలో 6.47 కోట్ల కేసులతో(16శాతం)   తమిళనాడు నిలిచింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (3.1 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (3.55 కోట్లు), కేరళ (2.29 కోట్లు) ఉన్నాయి. 0.28 కోట్ల కేసుల అమ్మకాలతో పుదుచ్చేరి 19వ స్థానంలో నిలిచింది. మరో దక్షిణాది రాష్ట్రం మహారాష్ట్రలో గతేడాది 2.71 కోట్ల విస్కీ కేసులు అమ్మడయ్యాయని IMFL వెల్లడించింది.

Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి

ఇక ఉత్తరాది రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌2.50 కోట్ల కేసుల (IMFL sales) అత్యదిక అమ్మకాలతో  జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గతేడాదితో పోలిస్తే దక్షిణాదిలో ఒకశాతం మద్యం వినియోగం పెరిగింది.. యూపీలో 6శాతం పెరుగుదల చూపింది. ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, పుదుచ్చేరిలలో 10శాతానికి పైగా వృద్ధి కనిపించింది.ఏటా ఆయా రాష్ట్రాలు గణనీయంగా పన్నులు పెంచడంతోపాటు మద్యం విధానాల్లో మార్పులు తెస్తుండటం మూలంగా అమ్మకాలపై ప్రభావం పడుతోందని సీఐఏబీసీ డైరెక్టర్‌ జనరల్‌ అనంత్‌ ఎస్‌ అయ్యర్‌ తెలిపారు.

ఇది కూడా చూడండి: TG News: హైదరాబాద్‌లో పోకిరీల అరాచకం.. పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి.. కాళ్లు మొక్కించుకుని..!

Advertisment
తాజా కథనాలు