/rtv/media/media_files/2025/05/20/lyFar99NFvdMfXAn7fr7.jpg)
Jyoti Malhotra
Jyoti Malhotra: ట్రావెల్ వ్లాగర్ పేరుతో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన జ్యోతి విషయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ట్రావెల్ వ్లాగర్‌గా కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా పలు దేశాల్లో ఆమె పర్యటించింది. అ పర్యటనలను తన సోషల్ మీడియాలో పెట్టి పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే గతేడాది జ్యోతి చైనాలోనూ పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ కొన్ని వీడియోలు కూడా తీసింది. ఈ సందర్భంగా చైనీయులతో ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
జ్యోతి గతంలో అనేక వీడియోలు చేసింది. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోని జనం తాజాగా ఆమె గూఢచర్యం విషయం బయటకు రావడంతో ఆమె చేసిన ప్రతి వీడియోను నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో జ్యోతికి సంబంధించిన పాత వీడియోలు ప్రస్తుతం మరింత వైరల్‌గా మారుతున్నాయి. ఆమె గతేడాది చైనా పర్యటనలో ప్రవర్తన, అక్కడివారిని ఎగతాళి చేసిన అంశాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Pakistani spy Jyoti Malhotra traveled to China & watch how she behaved there. She was tarnishing Bharat's image.
— BALA (@erbmjha) May 19, 2025
She is illiterate & irritating at the same time 🤢 pic.twitter.com/ZuPy21pQLB
చైనా పర్యటనలో భాగంగా ఆమె రూపొందించిన వీడియోలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అప్పుడే ఆ వీడియోలను చూసిన వారంతా రిపోర్ట్ కొట్టడంతో ఆమె వెంటనే క్షమాపణ కూడా చెప్పింది. ఆ వీడియోలు చూస్తే చైనాలో జ్యోతి ఎంత వల్గర్‌గా బిహేవ్ చేసిందో అర్థమవుతుంది. చైనాలో హై స్పీడ్ రైలు ఎక్కిన జ్యోతి విండో సీట్ కోసం ఓ ప్రయాణికుడిని అడగడం, స్కూటీ మీద వెళ్తున్న మహిళతో వాగ్వాదం, బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించడం, టికెట్ అడిగిన డ్రైవర్‌తో గొడవపడడం వంటి వల్గర్ ప్రవర్తనతో అక్కడి వారికి విసుగు పుట్టించింది.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
చైనా పర్యటనకు వెళ్లిన జ్యోతి అక్కడి వీధుల్లో, రైళ్లలో తిరుగుతూ పలు వీడియోలు చేసింది. ఆ సమయంలో ఆమె స్థానికులతో వ్యవహరించిన తీరుతో విమర్శల పాలైంది. చైనీయులు ఆమెను తిట్టుకున్నారు. అంతేకాదు మాండరిన్ భాషను విమర్శించడంతోపాటు, చైనీయులను బాడీ షేమింగ్ చేసింది. ఇంకా వారు వాడుతున్న ఫోన్లను గేలి చేయడంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఒక దశలో జ్యోతి ఇండియన్ అని తెలిసి మనదేశాన్ని వారు విమర్శించడం గమనార్హం. అయితే జ్యోతి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు రావడంతో అందరికీ క్షమాపణలు చెప్తూ మరో వీడియోను కూడా పోస్టు చేసింది. కానీ, చైనీయులు మాత్రం జ్యోతిని పట్టించుకోలేదు.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..