/rtv/media/media_files/2025/05/21/HfJatnVy4NgckTlmH1y2.jpg)
దేశంలోనే తొలి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా మిజోరం నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి స్వయంగా వెల్లడించారు. మిజోరం విశ్వవిద్యాలయం (MZU)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ విజయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని చౌదరి అభినందించారు. ఇది మిజోరంకే కాదు, యావత్ దేశానికీ గర్వకారణమైన రోజు అని అభిప్రాయపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం 91.33 శాతం అక్షరాస్యత రేటును కలిగి ఉంది, దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఇప్పుడు దానిని బ్రేక్ చేసింది.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..
చారిత్రాత్మక ఘట్టం
ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత 98.2 శాతంగా ఉన్నట్లుగా ఆ రాష్ట్ర సీఎం లాల్దుహోమా వెల్లడించారు. దీనిని మరింతగా మెరుగు పరుస్తామని వెల్లడించారు. సమిష్టి కృషి, అంకితభావం, సమాజ సమీకరణ ఫలితంగా మిజోరం పూర్తి అక్షరాస్యత సాధించిందని ఆయన తెలిపారు. మిజోరం రాష్ట్ర ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఇది రాబోయే తరాల వారు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. మిజో ప్రజలందరూ పెద్ద కలలు కనాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కూడా చూడండి: Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
కాగా ఏ రాష్ట్రమైనా 95% బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలలో కేరళలో అక్షరాస్యత స్థాయి 93.91 శాతం, మిజోరంలో 91.58 శాతం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత రేటు 74.04 శాతంగా ఉంది. ఫిబ్రవరి 20, 1987న భారతదేశంలో 23వ రాష్ట్రంగా అవతరించిన మిజోరం, 21,081 కిమీ (8,139 చదరపు మైళ్ళు) భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉంది.
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’
mizoram | Literate State | india | telugu-news