BIG BREAKING: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ప్రమోషన్.. సోషల్ మీడియాలో జోకులు

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అత్యున్నత ఆర్మీ ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను అసీమ్ మునీర్‌కు ఇస్తున్నట్లు పాక్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాక్‌లో ఈ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి ఈయనే.

author-image
By K Mohan
New Update
Pakistan Chief Asim Munir

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అత్యున్నత ఆర్మీ ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను అసీమ్ మునీర్‌కు ఇస్తున్నట్లు పాక్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫాకిస్తాన్‌లో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి అసీమ్ మునీర్. ఈ ర్యాంక్ చాలా అరుదు. చివరిసారిగా 1959లో జనరల్ అయూబ్ ఖాన్‌కు లభించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తూ జనరల్ ర్యాంక్‌లో ఉన్నారు. భారత్, పాక్ ఉద్రిక్తతలు, పరస్పర దాడులు చేసుకుంటున్న సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో యుద్ధం మధ్యలో పారిపోయినోడికి ప్రమోషన్ ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ అసీమ్ మునీర్ ఆయనకు ఆయనే ఇచ్చుకున్నారని ఎద్దేవా చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు.

ప్రపంచంలోనే మొదటిసారి యుద్ధంలో ఓడిపోయి కూడా బహుమతి అందుకున్నవ్యక్తి అసీమ్ మునీర్ అని నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్‌పై భారత్ చేసిన దాడులను ఎదుర్కొనలేక పోయినందుకు ఆయనకు ప్రమోషన్ ఇచ్చారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మూడు రోజుల్లో విజయవంతంగా 11 ఎయిర్ బేస్‌లు, 6-7 ఫైటర్ జెట్లు, 200 ఉగ్రవాదులను, 50మందికి పైగా సైన్యాన్ని, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను నాశనం చేసినందుకు ఆయనకు పదోన్నత ఇవ్వాల్సిందే అని ఇంకొందరు హేళన చేస్తున్నారు. 

 

ప్రపంచంలో అసీమ్ మునీర్ వివాదస్పద వ్యాఖ్యలతోనే పాక్, భారత్ గొడవ ముదిరింది. పహల్గామ్ ఉగ్రదాడి కొన్ని రోజుల ముందు ఆయన జమ్మూ కశ్మీర్ గురించి ఓ మీటింగ్‌లో మాట్లాడారు. అది పాకిస్తాన్‌కు ముఖ్యమైన రక్తనాళమని చెప్పుకొచ్చారు.

ఇండియాలో కూడా ఇప్పటి వరకూ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇద్దరికి ప్రకటించారు. 1973లో KM కరియప్ప, 1986లో సామ్ మానెక్షా లకు భారత ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇచ్చింది.

(pak army chief asim munir | pak army chief escape | shehbaz-sharif | pm shehbaz sharif | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు