Operation sindoor: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

సిక్ దేవాలయం గోల్డన్ టెంపుల్‌లో ఎయిర్ డిఫెన్స్ తుపాకులను ఉంచారని వస్తున్న వార్తలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం నుంచి పాక్ క్షిపణులు తిప్పికొట్టారని రూమర్లు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు.

New Update
Golden Temple

ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వర్ణదేవాలయం ప్రాంగణంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉంచారని వస్తున్న వార్తలను ఇండియన్ ఆర్మీ మంగళవారం ఖండించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో వైమానికి రక్షణ తుపాకులు, ఇతర మిలటరీ సామాగ్రి మోహరించారని రూమర్స్ వచ్చాయి. దీంతో ఈరోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు వాటిపై క్లారిటీ ఇచ్చారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని పాకిస్తాన్ టార్గెట్ చేసిన మాట వాస్తవమే.. పాక్ మిస్సైల్ దాడులను ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే వాటిపై స్వర్ణ దేవాలయ ప్రాంగణం నుంచి ఎదురుదాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. ఈ వాదనను మతపరమైన అధికారులు, సిక్కు మత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) కూడా నిర్ద్వంద్వంగా ఖండించాయి.

Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారని, తుపాకీ మోహరింపు వంటి ఏదైనా అసాధారణ కార్యకలాపాలు గుర్తించబడకుండా ఉండేవని ధామి అన్నారు. తీవ్ర ఉద్రిక్తతల సమయంలో సైన్యం పాత్రను అంగీకరిస్తూనే, "అబద్ధాల" వ్యాప్తిని ఆయన విమర్శించారు మరియు ప్రభుత్వం నుండి అధికారిక వివరణ కోరుతున్నారు. బ్లాక్ అవుట్ సమయంలో లైట్లు మాత్రమే నిలిపివేశామని మాత్రమే ఆలయాధికారులు తెలిపారు. 

Also read: Covid-19 Cases : కరోనా మరణాలు  మళ్లీ మొదలయ్యాయి.. కేరళ, ముంబైలో భారీగా కేసులు!

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

(operation Sindoor | golden-temple | Attack on Sukhbir Sing At Golden Temple | Indian Army | Indian Air Force | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు