/rtv/media/media_files/2025/05/01/zwUixutMvw5NSu52ALf3.jpg)
tamilnadu government launching new website for tamil baby names
M.K Stalin: తమిళ సంస్కృతిని పరిరక్షించడానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు ఒక ముఖ్యమైన అడుగుగా తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సరికొత్త సంస్కృతిక కార్యక్రమాన్ని ప్రకటించారు. పిల్లలకు తమిళ పేర్ల కోసం ఒక వెబ్ సైట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో అర్థాలతో కూడిన అందమైన తమిళ పిల్లల పేర్లు అందుబాటులో ఉండనున్నాయి. తమిళ వర్చువల్ అకాడమీ, తమిళ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వెబ్ సైట్ ను రూపొందించనున్నారు.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..
అయితే బుధవారం డీఎంకే ఎమ్మెల్యే వేలు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన స్టాలిన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఆకాంక్షలు వెల్లడించారు. ''దయచేసి మీ పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టండి. అది నా హృదయపూర్వక విజ్ఞప్తి'' అని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వినియోగదారుడు స్పందిస్తూ.. చాలా మంది తమిళ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి తమిళ పేర్లు పెట్టాలని అనుకున్నా.. వాటికీ అర్థ వివరణలు తెలుసుకునేందుకు సరైన వెబ్ సైట్లు అందుబాటులో లేవు. దీనికోసం ప్రభుత్వం తమిళ పేర్లు, వాటి అర్థాలతో కూడిన ఒక వెబ్ సైట్ రూపొందిస్తే బాగుంటుంది అంటూ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేశాడు.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
தம்பி @srinileaks அவர்களது கோரிக்கை நிறைவேற்றப்படும்.
— M.K.Stalin (@mkstalin) April 30, 2025
குழந்தைகளுக்கான அழகிய தமிழ்ப் பெயர்களும் - அதற்கான பொருளும் அடங்கிய இணையப்பக்கம் தமிழ் இணையக் கல்விக்கழகம் மூலம் தொடங்கப்படும்! https://t.co/ER7RlExYYu
దీనికి సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. అర్థంతో కూడిన అందమైన తమిళ పేర్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను తమిళ వర్చువల్ అకాడమీ ద్వారా ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం తమిళనాడు ప్రజల నుంచి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సంఘాల నుంచి ప్రశంసలు అందుకుంది. పేర్లు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, అవి భాషా వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. చిన్ననాటి నుంచే మాతృభాష పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు ఇది మంచి ప్రయత్నమని భాషా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
latest-news | CM MK Stalin | tamil baby names website
Also Read: Retro Twitter Review: 'కంగువా' తర్వాత సూర్యకి హిట్టు పడిందా?.. రెట్రో ట్విట్టర్ రివ్యూ