Indian Army: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన

ఇండియా పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తుంది. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది.

New Update

india pak war : ఇండియా పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తుంది. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని గతంలోనే భారత ఎయిర్‌ పోర్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విమరణ ఇకపై కూడా కొనసాగుతుందని వెల్లడించింది. పీవోకేలో చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు ఉగ్రవాదంపై మన పోరు కొనసాగుతుందని భారత ఆర్మీ స్పష్టం చేసింది.  కాగా, ఈ రోజు జరగాల్సి ఉన్న ఇండియా, పాక్ డీజీఎంఓ (GDMO) చర్చలు కూడా జరగటం లేదని తెలిపింది. కాగా కాల్పుల విరమణ కుదరిన తర్వాత ఈనెల 12న ఇరుదేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

Tension On The Borders

 కాగా ఈ రోజుతో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుండటంతో మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులున్నాయని ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో సరిహద్దల వెంట భారీగా సైన్యాన్ని మొహరించింది. పాక్‌ కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటుందా? లేక ఉల్లంఘిస్తున్న అనే అంశం పైన్నే ఆర్మీ దృష్టి చారించింది. కాగా ఒకవేళ పాక్‌ తిరిగి కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నట్లు సైన్యం తెలిపింది. పాక్‌ వైపు నుంచి ఏ సమస్య ఎదురైన ప్రతిచర్య చేపట్టడానికి  భారత త్రివిధ దళాలు  సిద్ధంగా ఉన్నాయి.

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్! 
 
కాగా జమ్మూ లోని పహల్గాం ప్రాంతంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. దీంతో ప్రతీగా భారత్‌  పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యకు దిగింది. ఈ దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత పాక్‌ ప్రతిదాడికి దిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత్‌ తిరిగి దాడులు చేపట్టి పాకిస్థాన్‌ ఆస్తులను విధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా అమెరికా జోక్యంతో ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఆ ఒప్పందం ఈ రోజు ముగుస్తుండటంతో పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడితే తిరిగి గట్టి బుద్ధి చెప్పడానికి భారత్‌ సిద్ధమైంది.

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

 ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

 

operation Sindoor | operation sindhoor | india operation sindoor | IND-PAK War | ind pak war updates | ind pak war

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు