Bengaluru : నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఒక టెంపో ట్రావెలర్ నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం కింద టెంపో వాహనం ఇరుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.