/rtv/media/media_files/2025/09/30/tamil-nadu-police-rape-andhra-girl-2025-09-30-18-07-49.jpg)
Tamil Nadu police rape Andhra girl
Crime News : చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలు కామాంధులుగా మారారు. వృత్తి ధర్మాన్ని మరిచి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు తమిళ పోలీసులు ఆంధ్రా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీస్ వృత్తికి మచ్చతెచ్చిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి ప్రకారం.. సోమవారం అక్కాచెల్లెళ్లు అయిన ఓ ఇద్దరు యువతులు అరుణాచలం దైవ దర్శానానికి వెళ్లాలనుకున్నారు. అందులో భాగంగా ఆంధ్రా నుంచి టమాటలతో తిరువణ్ణామలై వెళుతున్న ఒక గూడ్స్ వాహనంలో ఎక్కారు. ఆ గూడ్స్ వాహనంలో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు, డ్రైవర్ తప్ప మరెవరూ లేరు. వాహనం రాత్రి సమయానికి ఎంథాల్ బైపాస్ రోడ్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో బైపాస్‌పై పెట్రోలింగ్‌లో నిర్వహిస్తున్న తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సురేశ్ రాజ్, సుందర్ ఈ గూడ్స్ వాహనాన్ని ఆపారు.
Also Read : సీఎం రేవంత్ అదిరిపోయే దసరా గిఫ్ట్.. ఇక కేవలం రూ.5కే..!
ఆ ఇద్దరు యువతులపై అనుమానం ఉందని చెప్పి వారిద్దరినీ వాహనం నుంచి కిందకు దింపారు. కొద్దిసేపువారిద్దరినీ ప్రశ్నించిన తర్వాత ఆ ఇద్దరు పోలీసులు యువతుల్లో ఒకరిని బలవంతంగా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెను దారుణంగా కొట్టి, లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే బాధితురాలి సోదరి ఎంతవారించినప్పటికీ వారు వినలేదు. ఆమె చూస్తుండగానే యువతిపై అత్యాచారం చేశారు. లైంగిక దాడి చేసిన తర్వాత పోలీసులు బాధితురాలిని రోడ్డుపక్కన వదిలి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో రోడ్డుపక్కన ఉన్న అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించారు.
స్థానికులు వెంటనే ఆమెను108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌పీ సుధాకర్, డీఎస్‌పీ సతీష్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని వారు పరిశీలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.బాధితురాలు చెప్పిన సమాచారం ఆధారంగా ఎస్పీ సుధాకర్ ఘటానా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అలాగే, తిరువణ్ణామలై మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఐదుగురు ఎస్‌ఐలు సహా 10 మందికి పైగా పోలీసులను మోహరించారు. నిందితులు పోలీసులే కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?