/rtv/media/media_files/2025/09/29/ec-1-2025-09-29-12-39-09.jpg)
TG Local Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. ఎన్నికల అధికారి ఎస్‌ఈసీ రాణికుముదిని అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. రిజర్వేషన్ల కేటాయింపు పలు గ్రామాల్లో గందరగోళంగా మారింది. ఓ గ్రామంలో మూడు స్థానాలు ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించగా ఆ గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఉండటం చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామంలో ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉండగా.. తల్లి, కుమారుడు మాత్రమే ఉంటున్నారు.
గందరగోళంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2025
ఓ గ్రామంలో మూడు ఎస్సీ రిజర్వేషన్లు రాగా, గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఎస్సీ అభ్యర్థులు ఉండడంతో గందరగోళ పరిస్థితి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామంలో ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉండగా.. తల్లి, కుమారుడు మాత్రమే… pic.twitter.com/55EBywW5p8
ఒకే ఓటుకు రిజర్వేషన్ కేటాయింపు..
ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్- ఎస్సీ మహిళ, 2వ వార్డు – ఎస్సీ మహిళ, 4వ వార్డు – ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఇక సర్పంచ్‌గా తల్లి కాంపల్లి కోటమ్మ, 4వ వార్డు మెంబర్‌గా కొడుకు దావీదు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. మరోవైపు నల్లగొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని అభంగపురం గ్రామంలో ఒక ST ఓటు కూడా లేదు. కానీ ఆ గ్రామంలో ST రిజర్వేషన్ కేటాయించారు. ఇక గజలపురం గ్రామంలో కూడా ఒకే ఒక ST ఓటు ఉంది. ఆ గ్రామం కూడా ST రిజర్వేషన్ వచ్చింది.
నల్లగొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని అభంగపురం గ్రామంలో ఒక ST ఓటు కూడా లేదు.. ఆ గ్రామం ST రిజర్వేషన్ వచ్చింది..దాని పక్క ఊరు గజలపురం గ్రామంలో కూడా ఒకే ఒక ST ఓటు ఉంది. ఆ గ్రామం కూడా ST రిజర్వేషన్ వచ్చింది ..ఇదే మండలంలో గ్యారకుంటపాలెం గ్రామంలో ST ఓటర్ల ఉన్నారు.. ఆ గ్రామంలో రాలేదు
— KHASEEM SHAIK (@KHASEEM1990) September 29, 2025
రిజర్వేషన్లు మారుస్తారా?
ఇదే మండలంలో గ్యారకుంటపాలెం గ్రామంలో ST ఓటర్ల ఉండగా ఆ గ్రామంలో మాత్రం రిజర్వేషన్ రాకపోవడం విశేషం. ఈ సమస్య ఇంకా పలు గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తుండగా దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఓటర్లు లేని గ్రామాల్లో మళ్లీ రిజర్వేషన్లు మారుస్తారా? లేక జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.