TG News: సీఎం రేవంత్ అదిరిపోయే దసరా గిఫ్ట్.. ఇక కేవలం రూ.5కే..!

దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ పేదలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

New Update
hyd cantn

TG News: దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ పేదలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు మోతినగర్ , ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ దగ్గరలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో క్యాంటీన్లను ప్రారంభించి వివిధ రకాల టిఫిన్లను వడ్డించారు. ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్‌లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

7 రకాల టిఫిన్స్..

ఇక ఒక ప్లేట్ టిఫిన్ తయారీకి రూ.19 రూపాయలు ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.14 భరించి రూ.5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ అందిస్తుందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరిక‌‌ృష్ణా ఫౌండేషన్‌‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మొత్తం 150 కేంద్రాలకుగాను మొదటి దశలో 60 కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురాగా.. నగరవ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్‌ను జీహెచ్ఎంసీ అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ ఈ కేంద్రాల ద్వారా అందిస్తారని, మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరితో పాటు పొంగల్ ఉంటుందన్నారు.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

పేదల ఆకలి తీర్చేందుకే..

హైదరాబాద్ లో అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల ఆకలి తీరనున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని అందించనున్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం నగరంలో 150 కేంద్రాల్లో ప్రతిరోజు సుమారు 30వేల మంది భోజనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 12కోట్ల మందికి భోజనం అందించగా 150 కేంద్రాలకుగాను ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే భోజనం అందిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కార్పోరేటర్లు పాల్గొన్నారు. 

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

Advertisment
తాజా కథనాలు