/rtv/media/media_files/2025/09/18/microsoft-updated-its-work-from-home-policy-2025-09-18-19-58-56.jpg)
Microsoft updated its work from home policy
కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను అందిస్తాయి. మరికొన్ని వారంలో కనీసం రెండు మూడు రోజులైన ఆఫీసుకు రావాలనే రూల్‌ను తీసుకొచ్చాయి. తాజాగా మరో ప్రముఖ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఓ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఇకనుంచి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ ఫిబ్రవరి 2026 నుంచి పూర్తిగా అమలు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఆఫీసు నుంచి పనిచేయని ఉద్యోగులు వాళ్ల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నారని పేర్కొంది. ఒకవేళ ఉద్యోగులు ఈ రూల్ పాటించకుంటే వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా?
సియాటిల్‌లోని ఉద్యోగులు సెప్టెంబర్ 2025 నాటికి ఈ రూల్‌ను పాటించాల్సి ఉంటుంది. ఈ తర్వాత దీన్ని అమెరికాలో ఇతర కార్యాలయాల్లో కూడా అమలు చేయనున్నారు. 2026 ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ కార్యాలయాల్లో ఈ రూల్‌ను అమలు కానుంది. ఖాతా నిర్వహణ, కన్సల్టింగ్, ఫీల్డ్ మార్కెటింగ్ వంటి పలు ఉద్యోగాలకు ఈ రూల్స్ వర్తించవని కంపెనీ తెలిపింది. ఇటీవల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా ఇంటి నుంచి పనిచేసే విధానం(WFH)లో మార్పులు చేసింది. ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే నిబంధనను కఠినతరం చేసింది .
Microsoft is officially sending employees back to the office.
— World of Statistics (@stats_feed) September 12, 2025
Microsoft is mandating employees work from offices at least three days a week, according to an internal email the company sent to staff on Tuesday.
Also Read: భారత్ పై ట్రంప్ యూటర్న్.. సుంకాల్లో భారీ మార్పులు.. కొత్త లెక్కలు ఇవే!