/rtv/media/media_files/2025/06/22/31-tolas-gold-stolen-from-a-house-in-bhainsa-2025-06-22-15-07-08.jpg)
Gold rates
మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి వంటి పండుగలు దేశంలో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పండుగలకు బంగారం కొనడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతేడాది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75 వేలు ఉండగా ప్రస్తుతం బంగారం ధర రూ.1,10,000కు పెరిగింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే అసలు చెప్పక్కర్లేదు. బంగారం ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతాయి. అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం సుమారుగా రూ.500 తగ్గింది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,264గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండి ధర రూ.1,25,563 ఉంది. అయితే భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు తగ్గడానికి గల కారణం ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Smart Phone: 13MP రియర్ కెమెరాతో రూ.7 వేల లోపే అదిరిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
10 శాతం వరకు బంగారం తగ్గవచ్చని..
సుంకాల ఉపశమనం, డాలర్‌తో రూపాయి బలపడటం బంగారం ధరలు కొంతవరకు పెరగకుండా నిరోధించవచ్చు. పండుగ సీజన్‌లో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, బంగారం, వెండిలో మార్పులు జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇకపై బంగారం ధరలు 10 శాతం వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలంలో 5-6 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వెండి ధరలు తగ్గడం కష్టమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పండుగ సమయంలో అంతర్జాతీయ బంగారం ధరలు ఔన్సుకు 3700 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Microsoft: ఉద్యోగులకు Microsoft బిగ్ షాక్.. అలా చేస్తే మీ ఉద్యోగం ఔట్!
భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్ష కంటే తక్కువగా కూడా పడిపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే ధరలు మరింత పెరగవచ్చు. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడే బంగారం కొనవద్దని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు వేచి ఉండి ఆ తర్వాత బంగారం కొనమని చెబుతున్నారు. అయితే ప్రజలు గతంలో ఎక్కువగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వారు 18K,14K ఆభరణాలను ఎంచుకుంటున్నారు. దీని వలన బంగారం తక్కువ ధరకు లభిస్తుందని మొగ్గు చూపుతున్నారు.