Supreme Court: ఆరావళిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court Stays Own Order On Aravalli Range Definition, Seeks Experts' Report

Supreme Court Stays Own Order On Aravalli Range Definition, Seeks Experts' Report

ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై(Aravalli Hills controversy) దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 100 మీటర్లు లేదా అంతకన్న ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించబడతాయని.. తక్కువ ఎత్తు ఉన్నవి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ గతనెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో సుప్రీం ధర్మాసనం దీన్ని సుమోటోగా స్వీకరించింది. గత నెలలో జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

Also Read: విచ్చలవిడిగా వీర్యదానం చేస్తానంటే కుదరదు.. ఈ రూల్స్ పాటించాల్సిందే!

Supreme Court Stays Own Order On Aravalli

ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు కొత్త నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే సుమోటోగా దాఖలైన ఈ కేసుపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాకు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేసింది.  ఇదిలాఉండగా ఈ ఏడాది అక్టోబర్‌ 13న కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పర్వాతాలకు 100 మీటర్ల ఎత్తు అనే కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించింది. ఈ సిఫార్సును సుప్రీంకోర్టు కూడా నవంబర్ 20న ఆమోదించింది. కానీ సుప్రీం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 

Also Read: ఉన్నవ్ రేప్‌ కేసులో మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

ఆరావళి పర్వతాలపై(save Aravalli Hills) ఇచ్చిన తీర్పును మళ్లీ పరిశించాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త జితేంద్ర గాంధీ సీజేఐకి సోమవారం లేఖ రాశారు. ఎత్తు ప్రాతిపదికన పర్వతాన్ని నిర్ణయిస్తే వాయువ్య భారత్‌ అంతటా పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆరావళి పర్వత శ్రేణుల్లో 90 శాతం పర్వతాలు రక్షణను కోల్పోతాయని తెలిపారు. మైనింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్‌ వ్యాపారాలు పెరిగిపోయి పర్యావరణంపై ప్రభావం పడుతుందని అన్నారు. మరోవైపు ఆరావళి పర్వాతాల్లో మైనింగ్ జరిగితే జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు