/rtv/media/media_files/2025/12/29/supreme-court-stays-delhi-hc-order-granting-bail-to-kuldeep-sengar-in-unnao-rape-case-2025-12-29-13-56-15.jpg)
Supreme Court Stays Delhi HC Order Granting Bail To Kuldeep Sengar In Unnao Rape Case
ఉన్నావ్ రేప్ కేసు(Unnao rape) లో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆయనకు జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బాధితురాలి కుటుంబం సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌పై స్టే విధించింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సహా CBI ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించింది. అలాగే నిందితుడు కుల్దీప్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 4 వారాల్లో స్పందించాలని ఆయనకు ఆదేశించింది.
సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అత్యాచార కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్‌ను జైలు నుంచి రిలీజ్ చేయొద్దని అన్నారు. ఓ కానిస్టేబుల్ పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ఎమ్మెల్యే మాత్రం కాదా? అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే అన్నారు. మేము కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటామని.. పబ్లిక్ సర్వెంట్లు ఎవరు అంటూ సెంగార్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు.
Also read: రేబిస్‌తో గేదె మృతి.. భయంతో 200 మంది గ్రామస్తులకు వ్యాక్సిన్లు
అసలేం జరిగింది ?
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల మైనర్ దళిత బాలిక సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా కూడా నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో ఆమె సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంటి ముందు సూసైడ్‌కు యత్నించారు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.
అయితే 2019 డిసెంబర్ 16న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కుల్దీప్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్ 20న ఆయనకు జీవిత ఖైదు, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా 2020 మార్చిలో ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాదాపు ఐదేళ్ల జైలు జీవితం తర్వాత కుల్దీప్ సింగ్ ఢీల్లీ హైకోర్టులో తనకు విధించిన శిక్షపై అప్పీల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణల నిరూపిచేందుకు సరైన ఆధారాలు లేవని, సీబీఐ దర్యాప్తులో లోపాలున్నాయని పేర్కొన్నారు. చివరికి కోర్టు ఆయన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ 2025 డిసెంబర్ 23న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బాధితురాలి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌పై స్టే విధించింది.
Also read: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడిన విజయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?
Follow Us