China:కరోనా పై ఆ పరిశోధనలు చేయలేదంటున్న చైనా!

వుహాన్‌ ల్యాబ్‌ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీలో కరోనా వైరస్‌ పై గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌ స్టడీస్‌ ఎప్పుడూ నిర్వహించలేదని, కొవిడ్‌ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదని పేర్కొంది.

New Update
carona

carona

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచి లీకయ్యిందనే అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి చైనా తాజాగా మరోసారి స్పందించింది. వుహాన్‌ ల్యాబ్‌ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. సాంక్రమిక వ్యాధుల పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సాయం చేసిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.

Also Read: Virat Kohli: అతడి వల్లే కోహ్లి ఔటయ్యాడు.. వారు కావాలనే అలా చేశారు: ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు!

వృద్ది చేయలేదు, లీక్ చేయలేదు...

వుహాన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీలో కరోనా వైరస్‌ పై గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌ స్టడీస్‌ ఎప్పుడూ నిర్వహించలేదని అనేకసార్లు స్పష్టం చేశాం.కొవిడ్‌ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదు, లీక్ చేయలేదు.వైరస్‌ మూలాలను కనుక్కోవడం పై వస్తోన్న అన్ని రకాల రాజకీయ ఆరోపణలను వ్యతిరేకిస్తున్నాం అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ పేర్కొన్నారు.

Also Read:Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. స్టార్ బౌలర్లు ఔట్!

చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ లో గెయిన్ ఆఫ్‌ ఫంక్షన్‌ అధ్యయనం కోసం అమెరికా అంతర్జాతీయ అభివృద్ది విభాగం సాయం చేసిందని అమెరికా మీడియాలో వార్తలు వెలువడ్డాయి.ఇదే కరోనా మహమ్మారికి కారణమవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది  ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసింది. ఇదే అంశం పై తాజాగా చైనా మరోసారి స్పందించింది.

Also Read: Rahane: సెంచరీ చేసినా జట్టునుంచి తప్పించారు.. అంతా వాళ్ల చేతుల్లోనే: బాంబ్ పేల్చిన రహానే!

Also Read: Mood Of The Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపికి 343 సీట్లు..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే

Advertisment
తాజా కథనాలు