/rtv/media/media_files/2025/01/31/PDlkXe8tkvC9zLNX72Wy.jpg)
Old City Metro Rail
బెంగళూరు మెట్రో ఛార్జీలను అక్కడి ప్రభుత్వం 50 శాతం మేర పెంచిన సంగతిత తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లోనూ పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం నిర్ణయించిన ధరలే ప్రస్తుతం ఉన్నాయని..ప్రయాణికుల డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త కోచ్ లు కొనుగోలు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని..ఆర్థికంగా ఆదుకోవాలని సదరు సంస్థ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇప్పుడున్న 57 మెట్రోరైళ్లు మూడు మార్గాల్లో చాలడం లేదు. అదనంగా మరో 10 మెట్రో రైళ్లు అయినా అవసరమని మెట్రో వర్గాలు అనుకుంటున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్నామని..సర్కారు ఆర్థికంగా తోడ్పాటుఇస్తే కొత్తకోచ్ లు కొంటామని అంటోంది. దీంతో ఛార్జీల సవరణ అంశం తెరమీదకి వచ్చింది.
ఐదేళ్లు పూర్తైన సమయంలో...
మెట్రో రైలు సేవలు మొదలై ఐదేళ్లు పూర్తైన సమయంలో ఛార్జీలు పెంచాలని రెండేళ్ల క్రితం ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.దీన్నికేంద్రానికి నివేదించగా అప్పుడు ఓ కమిటీ వేశారు. సదరు సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.
ఎన్నికల ముందు కావడంతో అప్పటి ప్రభుత్వం పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది.కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడం,బెంగళూరులో ఛార్జీల పెంపు తాజాగా అమల్లోకి రావడంతో హైదరాబాద్ మెట్రోలోనూ ఛార్జీల సవరణ అంశం పై చర్చ మొదలైంది. తాజా పెంపు ప్రతిపాదనలతో రావాలనే సంకేతాలను హెచ్‌ఎంఆర్ ఇదివరకే ఎల్ అండ్ టీకి ఇచ్చింది.
Also Read: Goutham Aadani: జీత్ వెనుక ఉన్న నిజమైన శక్తి ఎవరో తెలుసా అంటున్న గౌతమ్ అదానీ!