/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Zodiac-Signs-jpg.webp)
మేషరాశి వారికి ఈ రోజు మామూలుగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉండొచ్చు. సమయపాలన ముఖ్యం. తొందరపడి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి. చిన్నపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. రుణభారం పెరగవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.
Also Read: Hyderabad Metro: మెట్రో ఛార్జీల సవరణకు కసరత్తు!
వృషభరాశి వారికి ఈ రోజు అత్యంత ఫలదాయకమైన రోజు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. మీ కార్యదీక్ష, పట్టుదలతో అందరికి ఆదర్శంగా నిలుస్తారు. మీరు సమావేశాలు నిర్వహించే విధానం ఇతరులను ఆకట్టుకొని వారిలో స్ఫూర్తి నింపి ముందుకు సాగేలా చేస్తాయి.
Also Read: Goutham Aadani: జీత్ వెనుక ఉన్న నిజమైన శక్తి ఎవరో తెలుసా అంటున్న గౌతమ్ అదానీ!
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టినా విజయం అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రసంశలు పొందుతారు. సన్నిహితుల మధ్య అపార్థాలు, ఇరుగుపొరుగువారితో గొడవలు రాకుండా చూసుకోండి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు తారా స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.
సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే బెటర్.
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆత్మ విశ్వాసంతో వేసే ప్రతీ అడుగు విజయాన్ని చేకూరుస్తుంది. అహంకారం, గర్వం లేకుండా చూసుకోండి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బ తింటుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ కీలకమైన పనిలో విజయాన్ని అందుకుంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దృఢమైన పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. తారాబలం అనుకూలంగా ఉన్నందున పని చేసే ప్లేస్ మీ మాటకు విలువ పెరుగుతుంది.
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో పనిభారం పెరగకుండా చూసుకోండి.
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఖర్చులు పెరగవచ్చు.
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మనోబలంతో ఓ క్లిష్టమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది.
Also Read: Rahane: సెంచరీ చేసినా జట్టునుంచి తప్పించారు.. అంతా వాళ్ల చేతుల్లోనే: బాంబ్ పేల్చిన రహానే!
Also Read: అరే X ఏంట్రా ఇది.. ట్రంప్ ముందే మస్క్‌తో మజాకానా..?