Vivo V60: వివో నుంచి మరో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఈసారి తగ్గేదే లే!

Vivo V సిరీస్ నుంచి సరికొత్త మోడల్ Vivo V60 భారతదేశంలో త్వరలో విడుదల కానుంది. తాజా లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్ ఆగస్టు 12 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.

New Update
Vivo V60 SMARTPHONE LAUNCHING SOON IN INDIA

Vivo V60 SMARTPHONE LAUNCHING SOON IN INDIA

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో భారతదేశంలో తన లైనప్‌లో ఉన్న  Vivo V60 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. తాజాగా Vivo V60 మొబైల్‌కి సంబంధించిన కొన్ని లీక్‌లు బయటకొచ్చాయి. ఈ ఫోన్ Vivo V50కి తర్వాతి వెర్షన్.  

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Vivo V60 Launching Date

అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. Vivo V60 ఆగస్టు 12న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.37,000 నుంచి రూ. 40,000 మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇది గోల్డ్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది. 

Vivo V60 Specifications

Vivo V60 మొబైల్ 1.5K రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటుంది. దీనిలో స్టీరియో స్పీకర్‌లను అందించే ఛాన్స్ ఉంది. Vivo V60 స్మార్ట్‌ఫోన్‌లో భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. దీనికి Zeiss బ్రాండ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. 

Vivo V60లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది Android 16 ఆధారంగా OriginOSతో దేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌ ని కలిగి ఉండవచ్చు. Vivo V60 ఫోన్ 90 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 

Advertisment
తాజా కథనాలు