/rtv/media/media_files/2025/05/22/wheXtWWmhmXh0WVJQdSY.jpg)
Tamilanadu liquor scam
Tamil Nadu liquor scam : రూ.1000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వాన్నిఇరుకున పెట్టేలా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. అయితే ఈ కేసులో భాగంగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు విలువైన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. అయితే ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయిన TASMAC పై ఆర్థిక ఆరోపణలు చేయడంతో పాటు సంబంధిత అధికారుల ఇళ్లపై ఈడీ దాడులు చేయడాన్ని ఖండిస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా వారి పిటిషన్‌పై వాదనలు తర్వాత ఈడీ తన అన్ని పరిధిలు దాటిందన్న సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది.
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!
ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో కూడా లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపిస్తున్న ఈడీ తమిళనాడు వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. మద్యం షాపులు కేటాయింపు విషయంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) కీలకంగా వ్యవహరించగా అందులో ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ఈడీ ఆరోపణ. దీనీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. అయితే దీన్ని అధికార డీఎంకే సర్కార్ మొదటి నుంచి ఖండిస్తున్నది.
Also Read: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..
ఈ స్కామ్‌లో దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం సమకూర్చుతుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలోనే అవకతవకలు జరిగాయి. మద్యం షాపులు కేటాయించిన సమయంలోనే బిల్లుల విషయంలో ఈ కుంభకోణం జరిగిందన్నది ఈడీ ఆరోపణ. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఈడీ తరువాతి నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా