Viral Video: రెండు సెకన్ల వీడియో.. 100 మిలియన్ల వ్యూస్‌..ఇంతకీ ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా అంటేనే ఎవరికీ అంతుచిక్కని రహాస్యం. ఇక్కడ ఎవరు ఎలా హైలెట్‌ అవుతారో..ఎవరు అథఃపాతాళంలోకి తొక్కబడుతారో చెప్పలేం. అలాంటిదే ఒక యువతి ఆటోలో కూర్చుని తీసుకున్న రెండు సెకన్ల వీడియో ఇప్పుడు ‘ఎక్స్‌’లో కోట్లాది వ్యూస్‌తో దేశం మొత్తాన్ని ఊపేస్తుంది.

New Update
FotoJet - 2025-11-23T105154.224

Two-second video.. 100 million views

Viral Video : సోషల్ మీడియా అంటేనే ఎవరికీ అంతుచిక్కని రహాస్యం. ఇక్కడ ఎవరు ఎలా హైలెట్‌ అవుతారో..ఎవరు అథఃపాతాళంలోకి తొక్కబడుతారో చెప్పలేం. ఒక్కోసారి మనం పెట్టిన పోస్ట్‌నో.. వీడియోనో వ్యూస్‌ కు నోచుకోదు. మరొకసారి పెద్దగా కంటెంట్‌ లేకపోయినప్పటికీ ఆ వీడియో వైరల్‌ అవుతుంటుంది. అలాంటిదే ఒక యువతి ఆటోలో కూర్చుని తీసుకున్న రెండు సెకన్ల వీడియో ఇప్పుడు ‘ఎక్స్‌’లో కోట్లాది వ్యూస్‌తో దేశం మొత్తాన్ని దుమ్ము రేపుతుంది. ఆ వీడియోలో అసలేం ఉంది? ఎందుకు ఇంతటి ప్రకంపనలు, అందులో ఉన్న అమ్మాయి ఎవరసలు అంటే చాలా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

నవంబర్ 2న ‘bud wiser @w0rdgenerator’ పేరుతో ఎక్స్  ఖాతా ఉన్న ఓ యువతి ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘Makeup ate today’ (ఈరోజు మేకప్ చాలా బాగా కుదిరింది) అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఆ వీడియోలో ఆమె వైట్‌ టాప్, వెండి చెవిపోగులు ధరించి కనిపించింది. ఆటోలో కూర్చుని కెమెరాలోకి చూసిన రెండు సెకన్ల క్లిప్ 10 కోట్ల వ్యూస్‌, ఆరు వేల కామెంట్లు, 26వేల రీపోస్ట్‌లు, 1.25 లక్షల లైక్‌లకు కారణమైంది. అంతటితో ఆగలేదు ఇంకా దూసుకుపోతోంది.

ఇంతకు అమ్మాయేవరంటే?

ఈ వీడియో పోస్ట్ చేసిన యువతి ఎవరు అని ఆరాతీస్తే..ఆసక్తికర విషయాలు తెలిశాయి. అదేంటంటే ఆ అమ్మాయి అంతగా తెలిసిన ముఖం కాదు. సోషల్‌ మీడియాలో చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం. పోస్ట్‌ వైరల్‌ కావడంతో పలు మీడియా సంస్థలు ఆమె గురించి  ఆరా తీయడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో  ఆమె పేరు ప్రియాంగ అని తెలిసింది. తన వీడియో ఇంతగా వైరల్ అవ్వడం స్వయంగా ఆమే నమ్మలేకపోతోంది. ‘నేను మహా అయితే వెయ్యి లైకులు వస్తాయని అనుకున్నాను. ఇప్పుడు నా కంట్రోల్‌లో లేదు. నా ముఖాన్ని పదే పదే చూసి నేనే అలసిపోయాను’ అని ఆమె తన ఆనందం వ్యక్తం చేసింది.

ఈ వీడియో ఎంతగా వైరల్ అయిందంటే.. సోషల్‌ మీడియాను స్క్రోల్‌ చేసే అలవాటున్న ఏ ఒక్కరూ కూడా దీన్ని దాదాపు దీన్ని మిస్సయి ఉండరు. అయితే, ఈ వీడియో ఎందుకు ఇంతలా వైరల్‌ అయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ‘ఈ పోస్ట్‌లో అంత ప్రత్యేకత ఏముంది?’ అని చాలా మంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘ఈ నెలలో మా తల్లిదండ్రుల కంటే ఎక్కువసార్లు ఈ అమ్మాయినే చూశాను’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఎక్స్‌’ స్తంభించిపోయినప్పుడు కూడా ఈ ఒక్క వీడియోనే ప్లే అయ్యిందంటూ మరో యూజర్‌ చమత్కరించాడు. ఈ రెండు సెకన్ల క్లిప్ ఇప్పుడు మీమ్ టెంప్లేట్‌గా కూడ మారిపోయింది. వ్యూస్‌ను పెంచుకునేందుకు కంటెంట్ క్రియేటర్లు ఈ వీడియోను డిజిటల్ బిల్‌బోర్డ్‌లా వాడుకోవడం మొదలుపెట్టారు. 

ఇక ఇంతటి అద్భుతమైన ఆదరణతో ప్రియాంగ మామూలు యూజర్ నుంచి వెరిఫైడ్ యూజర్‌గా మారిపోయింది. ఆమె ఎక్స్‌ అకౌంట్‌ ‘bud wiser’కు ఇప్పుడు బ్లూటిక్ లభించింది. దీనిపై కూడా నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. "ఆమెకు బ్లూటిక్ వచ్చింది. ఈ వైరల్ వీడియో ద్వారా ఆమెకు వచ్చే పారితోషకం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున డాలర్లను సమకూర్చి పెడుతుంది. రూపాయిని బలోపేతం చేస్తుంది’’ అని ఒకరు కామెంట్‌ చేయడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు