ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !

ఈవీలంపై అనుమానాలు ఉన్నాయని, ప్రజలకు వీటిపై విశ్వాసం లేదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. ప్రజలకు విపక్షాలు ఈవీలంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో వారు గెలిస్తే ఇలా ఆరోపణలు చేసేవారుకాదంటూ బదులిచ్చారు.

author-image
By B Aravind
New Update
SHINDE

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ నేత శరద్‌ పవార్ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీలంపై అనుమానాలు ఉన్నాయని, ప్రజలకు వీటిపై విశ్వాసం లేదని అయినా ఓటు వేశారని తెలిపారు. అమెరికా, యూకే లాంటి దేశాల్లో బ్యాలెట్ విధానాల్లో ఎన్నికల్లో జరుగుతుంటే.. ఇండియాలో మాత్రమే ఈవీఎంలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. అయితే శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీలంపై చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.  

Also Read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!

'' ప్రజలకు ఈవీలంపై విపక్షాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారాలు చేస్తున్నారు. అవాస్తవాలు చెబుతున్నారు. ముందు మీరు ఎన్నికల ఫలితాలను అంగీకరించండి. ఒకవేళ మీరు ఎన్నికల్లో గెలిచినట్లైతే ఈవీలంపై ఇలా ఆరోపణలు చేసేవాళ్లు కాదు. ఓడిపోయినందుకే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఓడిపోయామని విపక్షాలు అంగీకరించక తప్పదు. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి 43.55 శాతం ఓట్లు వచ్చాయి. మహా వికాస్ అఘాడికి 43.71 శాతం ఓటింగ్ వచ్చింది. మహాయుతి 17 ఎంపీ స్థానాల్లో గెలిస్తే.. ఎంవీఎస్‌ 31 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ కూడా మరి ఈవీఎం స్కామ్ జరిగిందని చెప్పగలరా ?'' అని షిండే అన్నారు. 

Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం

ఇదిలాఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి 230 స్థానాల్లో గెలిచింది. దీంతో విపక్ష కూటమి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గత కొంత కాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు.  ఇక డిసెంబర్ 5న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, అలాగే ఎన్సీపీ నేత అజిత్‌ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. 

Also Read: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

Also Read: డబ్బులు ఊరికేం రావు.. బ్యాంక్ మేనేజర్‌ని చితక్కొట్టిన కస్టమర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు