Ahmedabad: డబ్బులు ఊరికేం రావు.. బ్యాంక్ మేనేజర్‌ని చితక్కొట్టిన కస్టమర్

ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీ మినహాయించలేదని బ్యాంక్ కస్టమర్ మేనేజర్ పై దాడికి దిగాడు. ఇది గుజరాత్ అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్‌ యూనియన్ బ్యాంక్‌ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కస్టమర్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

New Update
bank m

యూనియర్ బ్యాంక్‌లో జైమన్ రావల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. ఆ మొత్తం డబ్బుపై బ్యాంక్ ట్యాక్స్ విధించింది. దీంతో కస్టమర్ బ్యాంక్‌ మేనేజర్‌పై దాడికి దిగాడు. FDపై ట్యాక్స్ మినహాయించలేదంటూ ఎడాపడా కొట్టడం స్టార్ట్ చేశాడు. మొదటి వారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ను జైమన్ రావల్ చితక్కొట్టాడు. బ్యాంక్ లో ఉన్న వారు మధ్య ఘర్షణ వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం

జైమన్ రావల్ అతని తల్లితో పాటు బ్యాంక్‌కు వచ్చాడు. మేనేజర్‌పై దాడిని అక్కడున్నవారందరూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా జైమన్ రావల్ ఆగకుండా బ్యాంక్ మేనేజర్‌ను కొడుతూనే ఉన్నాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇది జరిగింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

డిసెంబర్ 7న జైమన్ రావల్ వస్త్రాపూర్‌ ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాడు. అతని ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పెరిగిన ట్యాక్స్ ఎగ్జమ్షన్‌పై ఆగ్రహం చెందాడు. దీని గురించి బ్యాంక్‌ మేనేజర్‌, జైమన్ రావల్ మధ్య గొడవైంది. గొడవ కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో వారిద్దరూ ఒకరినొకరు కాలర్‌ పట్టుకుకున్నారు. ఇద్దరి మధ్య సినిమా రేంజ్‌లో ఫైటింగ్ జరిగింది. వారిని ఆపుతున్న బ్యాంక్ సిబ్బందిపై కూడా జైమన్ రావల్‌ దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు