/rtv/media/media_files/2025/07/31/starlink-granted-satellite-internet-permit-2025-07-31-20-07-13.jpg)
Starlink granted satellite internet permit
Starlink: భారత్‌లో స్టార్‌లింక్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీని శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు తాజాగా లైసెన్స్ పొందింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe), అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి స్టార్‌లింక్‌కు పర్మిషన్ లభించింది. 2021లో స్టార్‌లింక్ ముందుస్తు బుకింగ్‌లు స్వీకరించింది. లైసెన్స్ లేకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు అన్ని రూల్స్ పాటించి లైసెన్స్ పొందింది. దీంతో భారత్ ఈ స్టార్‌లింక్ సేవలు కొత్త శకానికి నాంది పలకనున్నాయి.
Also Red: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్
సమయం పడుతుంది
స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ప్రారంభించేందుకు లైసెన్స్‌లు పొందినప్పటికీ కూడా ఇవి వెంటనే అందుబాటులోకి రావు. ఇందుకోసం మరికొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా కేంద్ర ప్రభుత్వం స్టార్‌లింక్‌కు స్పెక్ట్రమ్‌ను కేటాయించాల్సి ఉంటుంది. అలాగే గ్రౌండ్ స్టేషన్లు నిర్మించాలి. వీటిని గేట్‌వే స్టేషన్లు అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్‌వే స్టేషన్లు నిర్మించాలని స్టార్‌లింక్ భావిస్తోంది. ఇవి శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను స్వీకరించి వాటిని ఇంటర్నెట్ డేటాగా మార్చేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
స్టార్‌లింక్ సేవల వల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్స్ వస్తాయి. ఇది 50 Mbps నుంచి 250 Mbps వరకు వేగాన్ని అందించగలదు. ఇక ప్రీమియం ప్యాకేజీలకైతే ఏకంగా 500 Mbps వరకు కూడా వేగం లభించే ఛాన్స్ ఉంటుంది. దీని ఖర్చు చూసుకుంటే హర్డ్‌వేర్ (డిష్) ధర దాదాపు 33 వేలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక నెలవారీ ప్లాన్లు 3 వేల నుంచి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇతర టెలికాం ఇంటర్నెట్ సేవల కంటే స్టార్‌లింక్ సర్వీసులు ఖరీదుగా ఉండనున్నాయి.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
20 లక్షల మందికి మాత్రమే
భారత్‌లో స్టార్‌లింక్ గరిష్ఠంగా 20 లక్షల మంది కస్టమర్లకు మాత్రమే సేవలు అందించగలదని కేంద్రం చెప్పింది. BSNL, ఇతర టెలికాం కంపెనీల సేవలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే స్టార్‌లింక్ సేవలు భారత్‌కు రానుండటంతో ఇంటర్నెట్ రంగంలో మరింత పోటీ పెరగనుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, వొడాపోన్ ఐడియా వంటి టెలికాం సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే స్టార్‌లింక్ సేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించనుంది. దీంతో ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలకు మరింత ఊతమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: 30 దేశాలపై రష్యా సునామీ విధ్వంసం.. సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి?