Tsunami: 30 దేశాలపై రష్యా సునామీ విధ్వంసం.. సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి?

పసిఫిక్ మహాసముద్రంలో సంభించిందిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలపై ప్రభావం పడనుంది. అమెరికా తీరాన్ని సైతం సునామీ తాకనున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాస్కా, హవాయి, వాషింగ్టన్ తీరంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

New Update
Pacific tsunami

Russia earthquakes tsunami warning:

పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్‌ తీర ప్రాంతాలను సునామీ తాకింది. తీరం వెంబటి 4 మీటర్ల మేరా అలలు విరుచుకపడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సంభించిందిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలపై ప్రభావం పడనుంది. అమెరికా తీరాన్ని సైతం సునామీ తాకనున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాస్కా, హవాయి, వాషింగ్టన్ తీరంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సునామీ ఈరోజు మధ్యాహ్నం సౌత్ కాలిఫోర్నియా తీరం తాకనుంది. జపాన్‌లో 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఎమర్జె్న్సీ సర్వీస్ కోసం జపాన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. హవాయిలోని హోనోలులులో సనామీ సైరన్లు మోగాయి. తీర ప్రాంతంలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

విదేశాల్లో భారతీయుల గురించి..

సునామీ ముప్పుని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కాన్సులేట్‌ జనరల్‌ X ఖాతాలో వెల్లడించింది.

అమెరికా హై అలర్ట్..

జపాన్‌ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు కూడా సునామీ ప్రమాదం పొంచి ఉంది. సునామీతోపాటు సైక్లోన్ ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలోని 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. వాటి జాబితాని అమెరికా సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌ విడుదల చేసింది. అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.

30 దేశాలివే

3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు ఎగసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్‌, రష్యా, వాయువ్య హవాయి దీవులున్నాయి. 
3 మీటర్ల లోపు అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్‌ పాలినేషియా, గువామ్‌, హవాయి, జపాన్‌, జార్విస్‌ ఐలాండ్‌, జాన్‌స్టన్‌ అటోల్‌, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్‌, పాల్మిరా ఐలాండ్‌, పెరూ, సమోవా, సోలోమన్‌ దీవులు ఉన్నాయి. 
అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్‌, కొలంబియా, కుక్‌ దీవులు, ఎల్‌ సాల్వడార్‌, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్‌, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌ తదితర దేశాల్లో 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.
0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.

భారత్‌కు సునామీ ప్రమాదం ఉందా..?

ఈ సునామీతో భారత్‌కు ఎలాంటి ముప్పు లేదని ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) పేర్కొంది. ఇన్‌కాయిస్ (INCOIS) ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘కామ్చాట్‌స్కీ తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. తర్వాత అది సునామీగా మారింది. అయితే, దీని కారణంగా భారత్‌కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదని Xలో రాసుకొచ్చింది. 

 video | tsunami in japan | russia earthquakes tsunami warning | japan tsunami 2015 | Russia Earthquake | earthquake japan 2025

Advertisment
తాజా కథనాలు