Jagannath Rath Yatra : పూరీలో తొక్కిసలాట కలెక్టర్‌, ఎస్పీలపై వేటు

ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర మూడోరోజు కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పూరీ కలెక్టర్‌, ఎస్పీలపై వేటు వేసింది.

New Update
odisha puri stampede

odisha puri stampede

ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర మూడోరోజు కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరిబోల్, జై జగన్నాథ్‌ అన్న భక్తుల నినాదాలతో పూరీ క్షేత్రం మారుమోగింది. అయితే  రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.  దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా ఈ విషయమై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

Jagannath Rath Yatra Stampede

 విచారణలో  భాగంగా ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ శంకర్ స్వైన్‌, పూరీ పోలీస్ సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్‌లను బదిలీ చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. ఏర్పాట్లలో లోపాల కారణాంగనే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఖుర్దా కలెక్టర్ చంచల్ రాణా నూతన జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని.. ప్రస్తుతం ఏడీజీ (క్రైమ్)గా ఉన్న సీనియర్ పోలీసు అధికారి పినాక్ మిశ్రా ఎస్పీగా విధుల్లో చేరతారని అధికారులు తెలిపారు.  

ఇది కూడా చూడండి:  Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...

ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి గుండిచా ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా..పలువురు గాయపడ్డారు. అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట నెలకొందని భక్తులు ఆరోపించారు. రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఘటన సమయంలో అంబులెన్సులు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలమంది భక్తులు రథయాత్రకు వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌  ప్రభుత్వం తరఫున క్షమాపణలు భక్తులను క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రథయాత్ర ముగిసే వరకు ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. 

Also Read: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు‌పై 5.2 నమోదు - పరుగులు తీసిన ప్రజలు

Also Read :  90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజినీర్లపై వేటు

 

stampede | Puri Jagannatha Temple | puri-jagannadh-rath-yatra | puri-jagannath-temple | puri-jagannadh

Advertisment
Advertisment
తాజా కథనాలు