Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

New Update
Elon Musk warns of population collapse due to falling birth rates

Elon Musk warns of population collapse due to falling birth rates

అధిక సంతానం మంచిది కాదనే వాదనను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ ఎప్పుడూ కూడా తప్పుబడుతుంటారు. తాజాగా ఆయన మరోసారి అదే వైఖరిని అనుసరించారు. ప్రస్తుతం అమెరికాలో జననాల సంఖ్య తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వివిధ సమస్యల వల్ల ప్రపంచంలో జననాల రేటు తగ్గుతోందని అన్నారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో జనాభా తగ్గుతుండటంతో సగటున ముగ్గురిని చెప్పిన ఫార్చ్యూన్ రిపోర్టును ఉటంకిస్తూ మస్క్ పోస్టు చేశారు.  

Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే సంపన్న దేశాలైన అమెరికా, ఇటలీ, జపాన్ వంటి దేశాల్లో జననాల రేటు ఏటా తగ్గుతోందని దీనివల్ల జనాభా రేటు పడిపోతుందని నిపుణులు తెలిపారు. దీన్ని నివారించాలంటే సంతానం కనగలిగే మహిళలు కనీసం ముగ్గురిని కనాలని సూచించారు. ఈ క్రమంలోనే అమెరికా లాంటి దేశాల్లో జననాల రేటు తగ్గడం వల్ల నాగరికత పతనమయ్యే ప్రమాదం ఉందని ఎలాన్ మస్క్‌ అన్నారు. తన మాటలు నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని తెలిపారు.

Also Read: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖమేనీని హత్య చేయాలనుకున్నాం, కానీ..

ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జనాభాపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొంది. వివిధ ఆరోగ్య సమస్యల వల్ల వందల మిలియన్ల మంది ప్రజలు తాము కొరుకున్నంతమంది పిల్లలను కనలేకపోతున్నట్లు తెలిపింది. సరైన భాగస్వామి దొరకకపోవడం, పిల్లలను పెంచేందుకు అధిక ఖర్చులు లాంటి విషయాలు దీనికి కారణమవుతున్నాయని వెల్లడించింది. ఇక సంతానోత్పత్తి రేటు తగ్గించడంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందని UNFPA భారత ప్రతినిధి ఆండ్రియా తెలిపారు. 1970లలో భారత్‌లోని మహిళలు 5 మందిని కనేవారని.. ప్రస్తుతం ఆ సంఖ్య పడిపోయిందని చెప్పారు.   

Advertisment
Advertisment
తాజా కథనాలు